SDPT: అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో వృద్ధురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎన్సాన్పల్లికి చెందిన జీకురు లచ్చవ్వ (85)కు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అందరికీ పెళ్లిల్లు అయ్యాయి. లచ్చవ్వ భర్త మల్లయ్య 3 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ప్రతి నెల ఒక కొడుకు దగ్గర ఉండే లచ్చవ్వ ఆత్మహత్య చేసుకుందని త్రీటౌన్ CI తెలిపారు.