KNR: గంగాధర మండలం బూరుగుపల్లిలో విద్యార్థులు, నిరుద్యోగుల సౌకర్యార్థం త్వరలోనే రీడింగ్ రూమ్ ఏర్పాటు చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశ్ తెలిపారు. శుక్రవారం బూరుగుపల్లి సర్పంచ్ దూలం కళ్యాణ్ ఆయనను గ్రామంలో రీడింగ్ రూమ్ అవశ్య కతను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ ఉన్నతాధికారులతో చర్చించి త్వరితగతిన పనులు చేపడతామని అన్నారు.