MHBD: గాంధీ భవన్లో TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఇవాళ MHBD నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరుతున్నామని చేరిన నేతలు తెలిపారు. మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న పాలనకు ఇదే నిదర్శనమని, అందరూ కలిసి ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు.