అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ గార్లదిన్నె మండలం పాపినేపాళ్యం గ్రామంలో పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన పార్టీ కార్యకర్త బోయ వెంకటేష్ నివాసానికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని సూచిస్తూ పార్టీ తరఫున అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. కష్టసమయంలో కార్యకర్తల వెంట నిలబడటమే తమ బాధ్యతని రాజేష్ పేర్కొన్నారు.