WNP: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వనపర్తి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో శుక్రవారం విద్యార్థులకు ఆర్టీవో సైదులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రహదారి నియమాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యత వివరించారు. అలాగే విద్యార్థులతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ పాల్గొన్నారు.