KMR: భిక్కనూర్ మండలంలోని NH-44 పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెట్రోల్ బంకులో పనిచేసే శేఖర్ (29) స్కూటీపై వెళ్తుండగా నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.