పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీకి జనవరి 7న ఉదయం 11 గంటలకు వాక్ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.శ్రీధర్ తెలిపారు. పీడియాట్రిక్, ఆప్తామాలజిస్ట్, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.