HYDలోని ENT ఆసుపత్రి సమీపంలో ఉన్న విజయ డైరీ నుంచి యూనివర్సల్ బుక్ స్టోర్ వరకు రూ.2.65 కోట్ల వ్యయంతో కొత్త వరద కాలువ నిర్మించనున్నారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల ఏర్పడే ఇబ్బందులను తగ్గించడం, రహదారులపై వరద ప్రవాహాన్ని సక్రమంగా మళ్లించడం ఈ పనుల ప్రధాన లక్ష్యం, కాలువ పూర్తయితే పరిసర ప్రాంతాల్లో జలముంపు సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయి.