KRNL: నూతన సంవత్సరం సందర్భంగా ఆలూరు నియోజకవర్గానికి చెందిన పోలీస్ అధికారులు ఇవాళ ఆలూరు TDP ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆమె అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ చట్ట పరిరక్షణలో బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.