MDK: రైతులు యూరియా కొనుగోలు కోసం ఎరువుల దుకాణాలకు తప్పనిసరిగా ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్ తీసుకెళ్లాలని పెద్ద శంకరంపేట మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ సూచించారు. పాస్బుక్ ఆధారంగా మాత్రమే అవసరమైన యూరియాను అందజేస్తామని తెలిపారు. పంట విస్తీర్ణం మేరకే యూరియా ఇవ్వాలని దుకాణదారులకు ఆదేశించినట్లు చెప్పారు.