GNTR: నగరంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం పరిశీలించారు. నగర ప్రజలకు రాకపోకలు మరింత సౌలభ్యంగా ఉండేలా చేపట్టిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పనుల నాణ్యత, భద్రతా ప్రమాణాలు ఎక్కడా తగ్గకుండా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు.