NGKL: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలు అభివృద్ధి పనులపై వారు చర్చించారు.