KNR:వచ్చే అక్టోబర్ నెల వరకల్లా గుండ్లపల్లి-పొత్తూర్ డబుల్ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవననాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అడిగిన అనుబంధ ప్రశ్నకు మంత్రి వెంకటరెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రూ.71 కోట్లు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.