WGL: నగరంలోని భద్రకాళి ఆలయాన్ని ప్రముఖ సినీ నటి డింపుల్ హయతి ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను నటించిన నూతన చిత్రం విజయవంతం కావాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు స్థానికులు, సినీ అభిమానులు ఆసక్తి కనబరిచారు.