WNP: జిల్లాలో అక్రమ మైనింగ్ ను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ తన చాంబర్లో అక్రమ మైనింగ్ అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచన మేరకు జిల్లాలో అక్రమ మైనింగ్‌ను సీసీ కెమెరాలు ద్వారా అరికట్టేందుకు కీలకమైన మార్గాలను గుర్తించాలని సూచించారు.