ATP: కంబదూరు మండలం నూతిమడుగు ఉన్నత పాఠశాలలో సురక్ష వెహికల్, శక్తి టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు సురక్ష వాహనంలోని వీడియోలను ప్రదర్శించి, భద్రతపై వివరించారు. శక్తి యాప్ డౌన్లోడ్ విధానం, ఉపయోగాలు తెలియజేశారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.