SRCL: ఆత్మ రక్షణ విద్య శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్ ఒక ప్రకటనలో కోరారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థినులకు ఆత్మ రక్షణ కోసం కరాటే, కుంగ్ఫూ, జూడో తదితర ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ ఇచ్చేందుకు నిపుణులైన శిక్షకులను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు.