సూర్యాపేట జిల్లాలో ఈనెల 3 నుంచి 20 వరకు జరిగే టెట్ పరీక్షల నేపథ్యంలో కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ ఈరోజు తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండరాదని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. ర్యాలీలు, సభలకు అనుమతి లేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.