MDK: మెదక్ డైట్ కళాశాల ప్రాంగణంలో రూ.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్, కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీవో రమాదేవి పాల్గొన్నారు. డైట్ ఎక్సలెన్సీ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, గర్ల్స్, బాయ్స్ హాస్టల్స్, క్యాంటీన్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.