తూ.గో జిల్లాలో పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలోని కలెక్టరేట్లో జరిగిన టూరిజం కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బ్రిడ్జి లంక ద్వీపాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు.