TG: అసెంబ్లీ లాబీలో ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందన్నారు. లంబాడి సామాజిక వర్గం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో లంబాడీలు అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారని ఉద్ఘాటించారు.