PDPL: సుల్తానాబాద్‌లోని విద్యుత్ వినియోగదారులకు అధికారులు ముఖ్య సూచన చేశారు. ఇప్పటి వరకు సుల్తానాబాద్‌లోని పూసల రోడ్డులో ఉన్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న కరెంట్ ఆఫీసుకు మార్చామని ఏఈ కె. కిషోర్ తెలిపారు. ఇకపై వినియోగదారులు కొత్త వసూలు కేంద్రంలోనే బిల్లులు చెల్లించాలని, ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.