WNP: పనికిరాని వ్యర్థాలతోనే అద్భుతమైన వస్తువులను తయారు చేయవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి అబ్దుల్ ఘనీ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘వేస్ట్ టు వెల్త్’ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు.