MDK: మనోహరబాద్ మండలం రామాజిపల్లి వద్ద హైవేపై జరిగిన జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో పుల్లం సతీష్ (36) అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కనగల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.