NGKL: అమ్రాబాద్ మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేతలు మిరియాల శ్రీనివాస్ రెడ్డి, గార్లపాటి శ్రీనివాసులు,కృష్ణారెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకుని, అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు, భక్తుల సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగింది.