ADB: ఆదిలాబాద్ అతివలకు, మహిళలకు విద్యార్థిని విద్యార్థులకు రక్షణగా షీ టీం బృందం పనిచేస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు మహిళల పట్ల జరుగు నేరాలు, అఘాయిత్యాలు, గుడ్ టచ్ బాడ్ టచ్, ఫోక్స్ చట్టంపై అవగాహన కల్పించారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్ 100 సంప్రదించాలని ఎస్పీ కోరారు.