TG: గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేత జానారెడ్డికి స్పీకర్ మైక్ ఇవ్వని సందర్భాలు చాలా ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అయినా గతంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్.. ఏనాడు అసెంబ్లీని బహిష్కరించలేదన్నారు. ప్రస్తుతం వాస్తవాలు బయటికి వస్తాయనే భయంతోనే బీఆర్ఎస్ పారిపోయిందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా ఉన్నప్పుడూ కేసీఆర్ పాలమూరుకు చేసిందేమీ లేదని విమర్శించారు.