MBNR: బాలానగర్ మండలం పెద్దాయపల్లి శివారులోని 102, 107 సర్వే నంబర్ల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వెంచర్ యజమాని అక్రమంగా ఆక్రమించారని సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య శుక్రవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని పేర్కొంటూ, ప్రభుత్వ భూమిని పరిరక్షించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.