HYD: ఐటీ కారిడార్ మార్గంలో ప్రస్తుతం మొత్తం 500 బస్సులు నడుస్తున్నట్లు RTC తెలిపింది. ఇందులో 200 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే సేవలందిస్తున్నాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరో 275 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందనుంది.