NZB: ఆర్మూర్ పట్టణంలోని టీఎన్జీవోస్ సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించామని అధ్యక్షులు శశికాంత్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయంలో నూతనంగా వచ్చిన గ్రామ పరిపాలన అధికారుల సభ్యత నమోదు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ విశాల్, సబ్ కలెక్టర్ కార్యాలయ డిఏవో విక్రం,తదితరులు పాల్గొన్నారు.