కృష్ణా: గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత ఇమ్మానుయేల్, బాధితులను జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ శుక్రవారం పరామర్శించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.