ASR: హుకుంపేట, గడికించుమండ పంచాయతీల్లో తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలు పరిష్కరించాలని అరకు ఎంపీ గుమ్మా తనుజారాణికి గిరిజన సంఘం వినతిపత్రం అందజేసింది. దొంతురాయి, హుకుంపేట మండల కేంద్రంలో ఐదేళ్లుగా నీటి సమస్య ఉందని, అధికారులు వెంటనే స్పందించకుంటే ఆందోళనలు తప్పవని సంఘం నాయకులు హెచ్చరించారు.