KMM: కూసుమంచి మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూనిఫామ్‌లను శుక్రవారం స్థానిక సర్పంచ్ కృష్ణవేణి పిల్లలకు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి విద్యార్థులకు యూనిఫామ్‌లను అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీడీవో కవిత, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.