KRNL: ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన వీరన్న, వీరేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మాజీ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చి అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందించినట్లు బాధితు కుటుంబ సభ్యులు తెలిపారు.