TPT: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఎఫ్పీ షాపుల ద్వారా కిలో రూ.20తో గోధుమ పిండి పంపిణీ చేస్తుందని జిల్లా ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ మౌర్య పేర్కొన్నారు. ఇవాళ తిరుపతి పట్టణం గిరిపురానికి చెందిన ఎఫ్పీ షాపు నెం. 09 నందు సబ్సిడీ గోధుమ పిండిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం సబ్సిడీని లబ్ధిదారులు ఉపయోగించుకోవాలని సూచించారు.