ATP: రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధిగాంచిన దశభుజ మహా వినాయకుడిని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు శుక్రవారం దర్శించుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా రాయదుర్గానికి విచ్చేసిన ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ మరింత అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.