AP: శ్రీకాకుళం జిల్లా వాసుల దీర్ఘకాలిక రైల్వే డిమాండ్ నెరవేరిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇవాళ అనుమతి లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మంజూరైన రైళ్లు పూరి-అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్-ఇచ్చాపురం వద్ద, బెరంపూర్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్-తిలారు వద్ద, భువనేశ్వర్-న్యూ విశాఖ ఎక్స్ప్రెస్-బారువ వద్ద హాల్ట్ కానున్నాయి.