WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన సూరా అనుకావ్యంజలి రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల వాలీబాల్ పోటీల్లో వరంగల్ జట్టుతో ద్వితీయ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు ఈ నెల 4 నుంచి 11 వరకు వారణాసిలో జరగనున్నాయి. ఇప్పటికే 8 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న అను కావ్యంజలిని క్రీడా సంఘాలు, గ్రామస్తులు ఘనంగా అభినందించారు.