KNR: రైతుల అవసరాలకు తగిన విధంగా బ్యాంకర్లు రుణాలు అందించాల్సిన అవసరం ఉందని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ (రెవెన్యూ) పేర్కొన్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేయడంపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆధ్వర్యంలో KNR, JGL,SRCL, PDPL జిల్లాలకు సమావేశం నిర్వహించారు.