NLG: రెవిన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఆయన శుక్రవారం తన చాంబర్లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల పాత్ర ముఖ్యమని, ‘ప్రజావాణి’ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు ఖచ్చితమైన పరిష్కారం చూపాలన్నారు.