JNG: మద్దూరు పోలీసుస్టేషన్ నూతన ఎస్సైగా ఆసిఫ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో మద్దూరు గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం, BRS నాయకులు ఆయనను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, కొత్తగా స్టేషన్కు వచ్చినందుకు అభినందనలు తెలిపారు. ఉపసర్పంచ్ షేకిల్, మాజీ ఎంపీటీసీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.