MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చున్నంబట్టివాడలో 100, 40, 20 ఫీట్ల రోడ్ల నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు కాలనీలో పర్యటించి ప్రజల నుంచి సంతకాలు సేకరించి మున్సిపల్ కమిషనర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుర్రే చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.