HYD: బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చిన పేదవాడికి అరకొర జీతాలతో కష్టాలు తప్పడం లేదు. ఏ మూల చూసినా కష్టాలు, కన్నీళ్లే తన జీవితంలో భాగమవుతున్నాయి. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, దవాఖానా ఖర్చులకే వచ్చే జీతం సరిపోతోంది. ఒక్కోరోజు కూరగాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో, కారం వేసుకుని పూట గడిపేద్దామనేంత బాధ కలుగుతోంది. కానీ.. పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడక తప్పడం లేదంటున్నారు.