SRPT: అనంతగిరి-నడిగూడెం మధ్య సాగుతున్న రహదారి విస్తరణ పనులు ప్రయాణికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రత్నవరం గ్రామ శివారులోని వాగు వద్ద వంతెన నిర్మాణం చేపడుతున్న వారు, అక్కడ కనీస ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు దారితీస్తుంది. వెంటనే అధికారులు బ్రిడ్జి వద్ద ప్రమాద సూచిక బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.