CTR: పుంగనూరు మండలం కొత్తపల్లి గ్రామంలో పొలాల్లోని బోరు మోటర్ల వైర్లను గుర్తు తెలియని దుండగులు చోరీ చేసినట్లు ఆ గ్రామ రైతులు తెలిపారు. గ్రామంలోని 10 బోర్ల వద్ద చోరీ చేసినట్లు తెలిపారు. దాదాపు 500 మీటర్లు వైరు చోరీ అయినట్లు చెప్పారు. దీని విలువ అక్షరాల రూ.90 వేల ఉంటుందని తెలిపారు. ఇవాళ విద్యుత్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.