MDK: రామాయంపేట మండల కేంద్రంలో ఫారెస్ట్ కార్యాలయం నిర్మాణానికి శుక్రవారం అధికారులు స్థలాన్ని పరిశీలించారు. గ్రామ శివారులోని సర్వే నెంబర్ 1466లో అటవీ శాఖ కార్యాలయం కోసం ప్రభుత్వం 360 గజాల భూమిని కేటాయించింది. ఈ సందర్భంగా తహశీల్దార్ రజనీకుమారి అధికారులకు భూమి అప్పగించారు. త్వరలోనే ఫారెస్ట్ కార్యాలయం నిర్మాణం ప్రారంభించనున్నట్లు ఎఫ్ఆర్ఓ విద్యాసాగర్ తెలిపారు.