VZM: వేపాడ మండలంలో మంజూరైన 165 ఇళ్ల నిర్మాణాలు సత్వరమే పూర్తి అయ్యేటట్లు అధికారులు చర్యలు చేపట్టాలని ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వేపాడలో హౌసింగ్ ఏఈ గంగాధర్, ఎంపీడీవో సూర్యనారాయణ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తై గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కోరారు.