AKP: అన్యాయంపై పోరాటం చేసే వారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీడీ యాక్ట్ పెడుతున్నాయని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ విమర్శించారు. శుక్రవారం ఎస్ రాయవరం మండలం ధర్మవరంలో మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్, బలవంతపు భూ సేకరణపై ప్రజల తరఫున పోరాటం చేస్తున్న అప్పలరాజుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని ఖండించారు.