VZM: జిల్లాలో పరిశ్రమల స్థాపన దరఖాస్తులను వెంటనే పరిశీలించి వేగంగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులతో నేడు సమీక్ష నిర్వహించారు. జిల్లాకు వచ్చే పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు కానున్న 8 ప్రధాన పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.