నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా ఇవాళ రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తోటపల్లి గూడూరు మండలంలోని ముంగళ దరువు గ్రామపంచాయతీ పరిధిలో ఎంపీ వేమిరెడ్డి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ రాజముద్రతో కలిగిన పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి పాల్గొన్నారు.